నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన సభ – 2023 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకుని, అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ సూచించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు …
Read More »Yearly Archives: 2023
తగ్గింపు ధరలో చలాన్లు చెల్లించండి…
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లోక్ అదాలత్ సందర్బంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీస్ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్‌ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. ఎన్. శ్రీదేవి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెండిరగ్ చలాన్ల డబ్బులు ఇక్కడ సులభంగా చెలించుకోవచ్చునని తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా …
Read More »అందుబాటులో సరిపడా దరఖాస్తు ఫారాలు
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల నుండి నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దరఖాస్తు ఫారాల కొరత ఎంతమాత్రం లేదని, ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాల పరిధిలోని అన్ని వార్డులకు నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా అప్లికేషన్ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 29, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ ఉదయం 6.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 2.32 వరకుయోగం : వైధృతి రాత్రి 2.28 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు తదుపరి వణిజ రాత్రి 7.30 వరకు వర్జ్యం : ఉదయం 8.53 – 10.32దుర్ముహూర్తము : …
Read More »పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉత్తరప్రదేశ్ లోని ఇటావాకు చెందిన సామాజిక కార్యకర్త రాబిన్ సింగ్ పిలుపునిచ్చారు. నానాటికీ కలుషితమవుతున్న పర్యావరణం ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతూ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాబిన్ సింగ్ దేశ వ్యాప్తంగా సుదీర్ఘ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్ యాత్ర ద్వారా రాబిన్ సింగ్ గురువారం నిజామాబాద్ …
Read More »అక్రమ నిర్మాణాలపై చర్యలేవి…
ఆర్మూర్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా …
Read More »ట్రాఫిక్ చలాన్‌లో తగ్గింపు…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చాలన్‌లో తగ్గింపునకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కోర్టు సూపర్డెంట్ చంద్రసేనారెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కోర్టు నందు ఈనెల 27 నుంచి 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం …
Read More »అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ‘ప్రజా పాలన’కు శ్రీకారం
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. నేటి నుండి జనవరి 06 వరకు (8 పని దినాలలో) కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం 112 గ్రామ పంచాయతీలు, నాలుగు …
Read More »శుక్రవారం ప్రజాపాలన సభలు జరిగే గ్రామాలు ఇవే …
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29 శుక్రవారం రోజున 101 గ్రామాలలో సభలను నిర్వహించి ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలను ఆమె వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని గుత్ప, గుత్పతండా, చేపూర్, ఫతేపూర్, పిప్రి, సురభిర్యాల్, …
Read More »పర్యావరణ పరిరక్షణపై సైకిల్ యాత్రీకుని సందేశం
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సైకిల్ యాత్ర చేపట్టిన రాబిన్ సింగ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద గురువారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. రసాయనకి ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు …
Read More »