Yearly Archives: 2023

కానిస్టేబుల్‌ సస్పెండ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ సంబందం పెట్టుకొని, బెదిరించి, వివాహితను మోసంచేసిన ఓ కానిస్టేబుల్‌ను రిమాండ్‌ చేసినట్టు పోలీస్‌ కమీషనర్‌ వెల్లడిరచారు. కణీకరం నటరాజు అనే ఎ.ఆర్‌ కానిస్టేబుల్‌ (2020) బ్యాచ్‌కు చెందినవాడు. కాగా ఇతని స్వంత ఊరు వేల్పూర్‌ మండలం, ఇతని బాల్యమిత్రుడితో మంచి స్నేహంగలదు. స్నేహితునికి 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. తరచుగా అతని స్నేహితుని ఇంటికి వెళ్ళి స్నేహితుని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబరు 16, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 11.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.31 వరకుయోగం : విష్కంభం ఉదయం 11.07 వరకుకరణం : బాలువ ఉదయం 11.42 వరకు తదుపరి కౌలువ రాత్రి 11.57 వరకు వర్జ్యం : రాత్రి 1.17 – 2.55దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

ఇది కామారెడ్డి ప్రజలతోనే సాధ్యం…

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండల కేంద్రానికి చెందిన 136 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. తెలంగాణ ప్రజలను …

Read More »

రసవత్తరంగా సాగిన కబడ్డీ పోటీలు

బాన్సువాడ, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9 వ జోనల్‌ స్థాయి క్రీడా పోటీలలో భాగంగా మూడవ రోజు ఆదివారం వాలీబాల్‌, కబడ్డీ, కో కో హ్యాండ్‌ బాల్‌, హై జంప్‌, లాంగ్‌ జంప్‌, రన్నింగ్‌, రిలే మొదలైన క్రీడలు జరిగాయి. బొర్లం గురుకుల విద్యార్థినులు కబడ్డీ అండర్‌ 17 లో సంపూర్ణ,వెన్నెల, కృష్ణవేణి, …

Read More »

ప్రచార జోరు పెంచిన కాసుల రోహిత్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకులు కాసుల రోహిత్‌ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్‌ గడపగడపకు కాసుల బాలరాజ్‌ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని హన్మజిపెట్‌ గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ …

Read More »

బి ఫారం అందుకున్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గం బారాస అభ్యర్థిగా ఆదివారం హైదరాబాదులోని బిఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో బిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఫామ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు టికెట్‌ కేటాయించి బీఫామ్‌ అందించినందుకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

బి ఫాం అందుకున్న కవిత…!

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్‌ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్‌ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్‌ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …

Read More »

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని అన్నారు. ఎంగిలి …

Read More »

వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి సేవలు అభినందనీయం…

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఆదివారం అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 12వ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, సమన్వయకర్త డాక్టర్‌ బాలు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి రక్తదాన …

Read More »

కామారెడ్డిలో కలాం జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో గల భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ నాయక్‌ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ క్షిపణి శాస్త్రవేత్తగా, భారతదేశ రాష్ట్రపతిగా, మంచి మనిషిగా పేరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »