Yearly Archives: 2023

పరస్పర సహకారంతో ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ హితవు పలికారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన శోభాయాత్ర, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు ఒకే రోజున నిర్వహించనున్న నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణ తీరుతెన్నుల గురించి ఇరు …

Read More »

ఆయిల్‌ ఫాం పంటలతో అధిక దిగుబడి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ పంటలకు అనువుగా ఉన్నందున ఆ దిశగా రైతులను ప్రోత్సహించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వ్యవసాయ విస్తరణాధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ఆయిల్‌ ఫామ్‌ పరిశ్రమలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం 5 వేల ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ పంటలు పండిరచాలని లక్ష్యమని, …

Read More »

పారదర్శకంగా ఓటర్ల జాబితా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ మను చౌదరి లతో కలిసి పెద్దకొడపగల్‌ మండలం జగన్నాధ్పల్లి లోని 163 వ పోలింగ్‌ కేంద్రాన్ని, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లోని 229 …

Read More »

దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌ చాంబర్‌ లో మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కమిటీ …

Read More »

చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వినాయక్‌ నగర్‌ లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, కలెక్టర్‌, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల …

Read More »

పోరాట యోధురాలు ఐలమ్మ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం సమీపంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి వివిధ సంఘాల నాయకులతో …

Read More »

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్‌ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే మార్గమైన …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, సెప్టెంబరు 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.15 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.45 వరకు తదుపరి ధనిష్ఠ తెల్లవారుజాము 6.05 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 10.58 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.27 వరకు తదుపరి బాలువ రాత్రి 11.15 వరకు వర్జ్యం : …

Read More »

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపడుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఓటరు నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, తుది ఓటరు జాబితా రూపకల్పన, …

Read More »

ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 72 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »