Yearly Archives: 2023

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 31, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి ఉదయం 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తెల్లవారుజాము 5.39వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.22 వరకుయోగం : సుకర్మ రాత్రి 8.39 వరకుకరణం : బవ ఉదయం 8.03 వరకు తదుపరి బాలువ రాత్రి 6.50 వరకు ఆ …

Read More »

నిజాంసాగర్‌ ఎస్‌ఐకి సన్మానం

నిజాంసాగర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎస్‌ఐ రాజశేఖర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ దుర్గరెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మనోహర్‌, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, యటకారి నారాయణ, దేవేందర్‌ రెడ్డి, మర్పల్లి రాములు, విజయ్‌ తదితరులు ఉన్నారు.

Read More »

టియు డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (ఫైనల్‌) తుది సెమిస్టర్‌ ఫలితాలను రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను పురస్కరించుకొని రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 40.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. మొత్తం డిగ్రీ పరీక్షలకు 9026 మంది హాజరు కాగా 3658 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారని పేర్కొన్నారు. ఇందులో అధికంగా …

Read More »

పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత

బీబీపేట్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం యాడవరం గ్రామానికి చెందిన ఎల్‌ దాసరి రాజమణి పర్షరామ్‌ గౌడ్‌ కూతురు రుచిత వివాహానికి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని గ్రామ ప్రజాప్రతినిధులు మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌కు తెల్పగా హైదారాబాద్‌ గౌడ హాస్టల్‌ ఛైర్మన్‌ మోతే చక్రవర్తి గౌడ్‌ సహకారంతో పుస్తేమట్టెలు బుదవారం మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ …

Read More »

తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అధ్వర్యంలో రక్షాబంధన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా విద్యార్ధి పరిషత్‌ నిజామాబాద్‌ నగర అధ్యక్షుడు అఖిల్‌ అధ్వర్యంలో నగరంలోని సత్య ఒకేషనల్‌ కళాశాలలో రాఖీ పండగ పురస్కరించుకొని విద్యార్థినీలతో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నాయకులు రాఖీ కట్టించుకొని రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్‌ మాట్లాడుతూ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల రక్షణకోసం తెలంగాణ …

Read More »

సూర్యోదయ హై స్కూల్‌లో రక్షాబంధన్‌ వేడుకలు

నందిపేట్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్షా బంధన్‌ పండుగను పురస్కరించుకుని నందిపేట్‌ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్‌కు చెందిన విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్‌ నాగారావు ప్రధానోపాధ్యాయుడు సురేష్‌ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పండుగ బుధవారం నిర్వహించారు. పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు రాఖీ …

Read More »

నోటిఫికేషన్‌ వద్దు – రెగ్యులరేషన్‌ ముద్దు

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌ వద్ద ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్‌ శంకర్‌ బుధవారం పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి వారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిని రెగ్యులర్‌ చెయ్యాలని, ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వెంటనే రద్దు చేయాలని …

Read More »

అభ్యంతరలుంటే తెలపండి…

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పాటు చేస్తున్న మొహ్మద్‌ నగర్‌ మండలం ఏర్పాటుకు అభ్యంతరాలు, సూచనలు అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ రెవెన్యు డివిజన్‌లోని నిజాంసాగర్‌ మండలం నుండి 18 గ్రామాలతో మొహమ్మద్‌ నగర్‌ నూతన మండలం ఏర్పాటుకు ఈ నెల 28 న ప్రాథమిక గజిట్‌ నోటిఫికేషన్‌ …

Read More »

సెప్టెంబర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అపోహలకు తావులేకుండా తప్పులులేని, స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించుటలో అన్ని రాజకీయపార్టీల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు. …

Read More »

అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »