నిజామాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఉపాధ్యాయుడికి ఫైనల్ షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గాప్రసాద్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే అబ్దుల్ ఖయ్యూం అనే ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
సదరు ఉపాధ్యాయుడు గత 2022 జూలై 1వ తేదీ నుండి విధులకు అనధికారికంగా గైర్హాజర్ అవుతున్నాడని డిఈఓ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖయ్యుమ్ను ఎందుకు విధుల నుండి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ తుది షోకాజు నోటీసు జారీ చేశామన్నారు. నోటీసు అందిన వారం రోజుల్లో వివరణ ఇవ్వని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీ.ఈ.ఓ తెలిపారు.