ప్రజా పాలనకు తెలంగాణ ఉద్యమ కారుల దరఖాస్తులు

డిచ్‌పల్లి, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

డిచిపల్లి మండలంలోని ఘనపూర్‌ గ్రామ పంచాయతీ వారు ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యమానికి ముఖ్య అధికారులుగా డిఆర్‌డిఏ పిడి చంద్రనాయక్‌, ఎంపిడివో గోపీబాబు, పంచాయతీ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఘనపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారులు దరఖాస్తు ఫారాలు అందజేశారు. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాలు చేసి, ఉద్యమంలో భాగంగా సారంగాపూర్‌ జైలుకు వెళ్లారు. ప్రజపాలనలో భాగంగా సిఎం రేవంత్‌ రెడ్డి ఉద్యమ కారులకు 250 గజాలు ఇంటి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మిస్తానన్నారు, కావున ఘనపూర్‌ నుండి వాసరి సాయినాథ్‌, బొల్లారం గంగదాస్‌, చెన్నూరు నరేందర్‌, మాసం గంగరాజు, చౌకి హరీష్‌, బొల్లారం సుమన్‌ ఉద్యమంలో విరందరు పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »