నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నెహ్రూ యువ కేంద్ర రాష్ట్రస్థాయిలో ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు అందుకుగాను ముందుగా జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనట్లు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీ ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఉపన్యాస పోటీలో 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు మధ్య గల యువతి యువకులకు మాత్రమే అవకాశం ఉంటుందని అలాగే ఉపన్యాస అంశము ‘‘నా భారతం వికసిత భారతం 2047 నాటికి’’ అనే అంశం మీద మాత్రమే ఉపన్యసించాల్సి ఉంటుందని తెలిపారు.
జిల్లా స్థాయి పోటీలో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని, రాష్ట్రస్థాయి పోటీలో ప్రథమ బహుమతిగా అక్షరాల లక్ష రూపాయల నగదు బహుమతిని ద్వితీయ బహుమతిగా 50 వేలు తృతీయ బహుమతిగా ఇద్దరికీ 25 వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
కావున జిల్లా స్థాయి పోటీల కోసం ఈనెల 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నెహ్రూ యువ కేంద్ర కార్యాలయ సెల్ నెంబర్ 9100435410 కు వాట్సాప్ ద్వారా తమ పేర్లు వివరాలను పంపించి పోటీ కోసం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ప్రకటించారు.