కామారెడ్డి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ర మధ్య నిషేధ, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖామాత్యులు జూపల్లి కృష్ణ రావు శనివారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మంత్రి శనివారం ఉదయం 9. 30 గంటలకు జగన్నాథపల్లి చేరుకొని కౌలాస్ కోటను సందర్శిస్తారు. అనంతరం పదిన్నర గంటలకు పిట్లం మండలంలోని కుర్తి లో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిజామాబాద్ మండలం కోటగిరి మండలం లోని కొత్తపల్లి గ్రామంలో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాన్నం 2 గంటలకు బాన్సువాడ చేరుకుంటారు.