Monthly Archives: May 2024

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల (జూన్‌) 9 న జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత …

Read More »

నిరాడంబరంగా అవతరణ వేడుకలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశమందిరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా …

Read More »

విత్తన దుకాణ డీలర్‌పై కేసు నమోదు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని బోధన్‌ పట్టణంలో గల ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ నిల్వలలో తేడా, ఇతర వివరాల నమోదులో లోటుపాట్లు కలిగిన ఓ దుకాణ డీలర్‌ పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో …

Read More »

ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1(ప్రిలిమ్స్‌) ఉచిత కోచింగ్‌ ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్‌ చేతుల మీదుగా ఉచిత స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే అభ్యర్థులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో బిసి స్టడీ …

Read More »

పనుల పురోగతి పట్ల కలెక్టర్‌ సంతృప్తి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం క్యాతంపల్లిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న టాయిలెట్స్‌ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్‌ పనులను పరిశీలించి రెండు రోజులలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

జూన్‌ 7న జడ్పి సాధారణ సర్వసభ్య సమావేశం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ సాధారణ సర్వ సభ్య సమావేశం జూన్‌ 7 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశ మందిరం నందు జెడ్పి అధ్యక్షురాలు దఫెదార్‌ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్పి ముఖ్య కార్యనిర్వాహనాధికారి చందర్‌ నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు, అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావలసినదిగా ఆయన కోరారు. …

Read More »

నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కలెక్టర్‌

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం బిక్నూర్‌ మండలంలోని విత్తన పంపిణి కేంద్రాలను, పెస్టిసైడ్స్‌ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పిఎసిసిఎస్‌ లోని దయించ స్టాక్‌ పాయింట్‌, రైతువేదికలో పర్మిట్‌ ఇష్యూ , …

Read More »

గ్యాస్‌ ఏజెన్సీ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఆనంత్‌ గ్యాస్‌ ఏజెన్సీ మరియు శేఖర్‌ గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుల 5వ రోజు సమ్మెలో భాగంగా అనంత్‌ గ్యాస్‌ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హనుమాన్లు మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మికులకు …

Read More »

దివ్యాంగులకు సూచన

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాటరీ ట్రై సైకిళ్ళ రిపేరింగ్‌ పై శశిక్షణ ఇచ్చుటకు మెకానిక్‌ రిపేరింగ్‌ లో అనుభవం గల దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇద్దరు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వికలాంగుల ఆర్ధిక పునరావాస పధకం క్రింద ఋణం అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి …

Read More »

ఏకగ్రీవంగా వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15 న వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందుప్రియ చైర్‌ పర్సన్‌ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్‌ చైర్‌ పర్సన్‌ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆథరైజ్డ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »