ఆర్మూర్, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మామిడిపల్లి వద్ద ఆరోగ్య శాఖ సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీని మామిడిపల్లి వీధులలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మానస మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కావున ఇప్పటినుండే ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానము మరియు దోమల వృద్ధి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, పూల కుండీలు టీ గ్లాసులు పాత టైర్లు పనికిరాని వస్తువులు ఆట బొమ్మలు లాంటివి ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి పైన పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే తొలగించుకోవాలని అదేవిధంగా సెప్టిక్ ట్యాంకుకు ఉండే ఏర్పాటుకు సన్నని జాలిని ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యాధికారిని డాక్టర్ ప్రీతి, పావని, పెరికిట్ ఎంఎల్హెచ్పి డాక్టర్ యాస్మిన్, హెచ్ ఈ ఓ రవి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.