కామారెడ్డి, మే 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం క్రింద 1 వ తరగతిలో డే స్కాలర్ ఇంగ్లిష్ మీడియ నందు, 5 వ తరగతిలో రెసిడెన్షియల్ గా ఇంగ్లిష్ మీడియం నందు ప్రవేశం కోరం అర్హులైన ఎస్సి బాల, బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఎస్సి కులాల అభివృద్ధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
1వ తరగతిలో ప్రవేశానికి 1 జూన్, 2018 నుండి 31 మే 2019 మధ్య జన్మించి ఉండాలన్నారు. కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాలలో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర ఉండాలన్నారు. దరఖాస్తు వెంట జనన, కుల ధ్రువీకరణ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జతపరచాలని సూచించారు. 5వ తరగతిలో ప్రవేశానికి పై ధ్రువీకరణ పత్రాలతో పాటు 4వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు, బోనఫైడ్ అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులను జతపరచాలని స్పష్టం చేశారు.
ఆసక్తి గల బాల,బాలికలు కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో జూన్ 7 వరకు దరఖాస్తు పొంది అందువెంట పై తెలిపిన ధ్రువపత్రాలను జూన్ 7 లోగా సమర్పించాలని, దరఖాస్తు సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలు తప్పనిసరిగా చూపించాలన్నారు. జూన్ 11 న మధ్యాన్నం 2 గంటలకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన ఎంపిక చేయబడునని, వివరాలకు 8328015942 నెంబరును సంప్రదించవచ్చని రజిత తెలిపారు.