కామారెడ్డి, మే 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హైదరాబాదులోని గాంధీ వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ ఉచ్చడ తులసి (29) అత్యవసరంగా ఏబి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో హైదరాబాదులోని 86 బ్లడ్ బ్యాంకులను సంప్రదించగా వారికి కావలసిన రక్తం లభించలేదు. ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలురు సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా గిద్ద గ్రామానికి చెందిన కల్వచర్ల సంతోష్ మానవతా దృక్పథంతో స్పందించి కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లి ఏబి నెగిటివ్ రక్తాన్ని ఎస్‌ఎల్‌ఎంఎస్ నాగోల్ లో గల రక్తనిధి కేంద్రంలో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎవరైనా రక్తం అవసరం ఉందని తెలియజేస్తే చాలామంది ఇవ్వడానికి ఆలోచించడం జరుగుతుందని అలాంటిది హైదరాబాదుకు వచ్చి రక్తదానం చేసిన సంతోష్‌కు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
రక్తదాత సంతోష్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లవేళలా రక్తాన్ని అందించడం జరుగుతుందన్నారు.