రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తికి రక్తం అందజేత…

కామారెడ్డి, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం పరిమల్ల గ్రామానికి చెందిన రాములు పట్టణంలోని వేద గ్యాస్ట్రో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు.

కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్‌ సహకారంతో అడ్లూరు గ్రామానికి చెందిన భార్గవ్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత భార్గవ్‌ కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌, ఐవిఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. వేసవికాలం కావడం వలన రక్త నిల్వలు లేకపోవడంతో పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని రక్తదానానికి యువకులు ముందుకు రావాలని అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »