డిచ్‌పల్లి, మే 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ, సెమిస్టరు రెగ్యులర్ మరియు ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో రెండవరోజు ప్రశాంతంగా ముగిశాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
ఉదయం జరిగిన పరీక్షకు 9109 విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 8337 మంది విద్యార్థులు హాజరైనారు. 772 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 8020 మంది విద్యార్థులు హాజరు 7493 మంది విద్యార్థులు హాజరైనారు. 527 మంది విద్యార్థులు హాజరు కాలేదని చెప్పారు. ఉదయం జరిగిన పరీక్షలో సిఎస్‌ఐ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్‌లో ఒకరు డిబార్ కాగా మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జి డి సి డిగ్రీ కాలేజ్ దర్పెల్లిలో ఇద్దరు డిబార్ అయ్యారని మిగిలిన పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ పేర్కొన్నారు.