ముగిసిన కేంద్ర సెక్రెటరియేట్‌ బృందం పర్యటన

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో సౌమ్యులని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అమలవుచున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు, ప్రజాభిప్రాయం, ప్రజా సమస్యలపై అధ్యయనం చేయటానికి జిల్లాకు వచ్చిన (27) మంది కేంద్ర సెక్రెటరియేట్‌ బృందం తో శుక్రవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో కలెక్టర్‌ అన్నారు.

మానవ వనరుల అభివృద్ధి ఆధ్వర్యంలో వివిధ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల బృందం ఈ నెల 20 నుండి 24 వరకు ఐదు రోజుల పాటు జిల్లాలోని పద్మాజివాడ, శివాయిపల్లి, నర్సన్నపల్లి, దోమకొండ, ఫరీద్‌ పేట గ్రామాలలో అమలు జరుగుచున్న పలు కార్యక్రమాలను నిశితంగా అధ్యయనం చేసి సందేహాలను ప్రస్తావించడంపట్ల కలెక్టర్‌ ప్రశంసించారు.

బృందం ఐదు రోజుల పాటు పాఠశాలలు, డిజిటల్‌ తరగతులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ ఉపాధి హామీ పనులు, స్వయం సహాయక బృందాల పనితీరు, ఆసుపత్రులు, విద్యుత్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, రేషన్‌ కార్డులు, భూ సమస్యలు, అంతర్గత రహదారులు తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి వీలవుతుందన్నారు. అట్టి కార్యక్రమాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరిన నాడే పథకాలకు సార్థకత, నిజమైన అభివృద్ధి జరిగినట్లని అన్నారు. పాఠశాలలో మంచినీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌, చిన్న చిన్న మరమ్మత్తులు వంటివి చేపడుతున్నామన్నారు.

విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలలో సోలార్‌ ప్యానల్‌ల ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా రెండు పడకల ఇండ్ల కేటాయింపు, వివిధ రకాల పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ప్రతి కార్యక్రమం డబ్బుతో ముడిపడి ఉంటుందని, చాలా జాగ్రత్తగా కార్యక్రమాలు అమలు చేయవలసి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ డిఓ చందర్‌, ఉమ్మడి జిల్లా హెచ్‌.ఆర్‌.డి. డా. వసుంధర పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »