ఆలయ ప్రాంగణంలో శ్రమదానం

ఆర్మూర్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం నిర్వహించి ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఆలయంలో అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను కట్టర్‌ తో కత్తిరించారు. పిచ్చి మొక్కలను, వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. పురపాలక సిబ్బంది సహకారంతో కొమ్మలను, చెత్తను తొలగించి ట్రాక్టర్‌ లో తరలించారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్‌ మాట్లాడుతూ గత 47 వారాలుగా స్వచ్ఛ కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుతున్నామని, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై కాలనీ వాసులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

50వ ఆదివారం ప్రజా ప్రతినిధులను, అధికారులను ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటి అధ్యక్షులు శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ జర్నలిస్ట్‌ కాలనీ అభివృద్ది కమిటి అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్‌, హనుమాన్‌ ఆలయ కమిటి అధ్యక్షులు శివరాజ్‌ కుమార్‌, కాలనీ కార్యదర్శులు కొంతం రాజు, రాజ్‌ కుమార్‌, ఆలయ ప్రతినిధులు గడ్డం శంకర్‌, కుమార్‌, ఎర్ర భూమయ్య, నరహరి, గణపతి, డి ఇ గణేశ్‌, రవి, సాయినాథ్‌, గోపి, భాజన్న, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »