ఆర్మూర్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ మున్సిపల్ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా కలిసి సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత ఆత్మీయంగా సంబురంగా జరుపుకున్నారు.
పూర్వ విద్యార్థులందరూ అలనాడు వారికి విద్యా బుద్ధులు నేర్పిన పూర్వపు గురువులను సమావేశానికి పిలిచి సన్మానించి సత్కరించారు. అంతకుముందు పూర్వ విద్యార్థులందరూ తమ పాఠశాల తీపి గుర్తులను, జ్ఞాపకాలను ఒకరినొకరు వేసుకొని, ఒకరికొకరు కుటుంబ విషయాలు పిల్లల విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వపు గురువులు టీవీ.చక్రధర స్వామి, పద్మావతి, సురేందర్, విజయలక్ష్మి, సుభాషిని, రఘునాథ్, శర్మలు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం స్వర్గాన్ని తలపించిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, పిల్లలకు వారి అదృష్టం మేరకు చదువుకోనివ్వాలని ఒత్తిడి తేవద్దని సూచించారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఇట్టేడి మోహన్ రెడ్డి, వేల్పుల లక్ష్మీనారాయణ, గైని రవి, నరహరి, భూమేశ్వర్, మూడ అశోక్, సృజన్, లింబాద్రి, మహిపాల్, శ్రీకాంత్, ప్రకాష్, ప్రభాకర్, రాజు, ప్రతాప్, రాజేందర్, భాస్కర్, లతీఫ్, రషీద్, జనార్దన్ గౌడ్, రాజ్ కుమార్, శ్రీధర్, గంగాధర్, జహీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.