నిజామాబాద్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్ సోమవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ో కలిసి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు.
పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు. కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, బారికేడ్లు, సిసి కెమెరాలు, స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరందు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.