కామారెడ్డి, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బిక్కనూర్ మండలం జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
బిబిపేట మండలం మాందాపూర్, దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను అరా తీశారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామాన్ని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం ప్రతినిధులు సందర్శించి అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం వివరాలను సేకరించారు.
నష్టపోయిన పంట గింజలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, పౌరసరఫరాల శాఖ ఇంచార్జ్ మేనేజర్ నిత్యానందం, అధికారులు పాల్గొన్నారు.