నిజామాబాద్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కుల మతాలకతీతంగా భారతీయులందరికీ ఆరాధ్యమైన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్ అని ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం వ్యాఖ్యానించారు.
స్వాతంత్ర వీర సావర్కర్ జయంతి సందర్భంగా గాజులపేట్‌లోని వశిష్ట మహర్షి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావర్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి జైలు గోడల మీద కూడా దేశభక్తి కవితలను రాసిన మహనీయుడు సావర్కర్ అని తెలిపారు.
అసమానమైన దేశభక్తితో, అచంచలమైన హిందుత్వ నిష్టతో తన చివరి శ్వాస దాకా దేశం కోసమే జీవించి మరణించేటప్పుడు కూడా భవిష్యత్తు భారతం కోసం గొప్ప దృశ్యాన్ని రూపొందించి తన రచనల రూపంలో భావితరాలకు అందించిన గొప్ప కవి అని తెలిపారు.
స్వతంత్ర భారత చరిత్రలో అందవలసినంత గుర్తింపు మరియు గౌరవం పొందకుండా కొంతమంది వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం సావార్కరణ దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేశారని ఆ ప్రయత్నాలను దేశభక్తులు అందరూ కలిసి తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
భారతీయులలో స్వాతంత్ర ఉద్యమ జ్వాలను రగిలించినవి కేవలం స్వావర్కర్ రచనలు మాత్రమేనని ,కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణను ఇచ్చిన మహనీయుడు సావర్కర్ అని అలాంటి మహనీయుడి జయంతిని ప్రతి భారతీయుడు ఘనంగా పండగలగా నిర్వహించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో నగర సహ కార్యవాహ సుమిత్, భార్గవ్, రంజిత్, స్వయం సేవకులు పాల్గొన్నారు.