నిజామాబాద్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వినాయక దామోదర్ వీర సావర్కర్ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28 నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి తన చిన్నతనం నుండే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ స్థాపించి స్వతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్దం లాంటిది అవసమని ఆ దిశగా యువతను ఆలోచంబచేసినరని తల్వార్ పత్రిక అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
దేశద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు విధించిన జైల్ శిక్ష అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్ శిక్ష అనుభవించినా, జీవితాన్ని దేశం కోసం నడిపించాలని ఆయన ఈ దేశ భక్తి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పడేగేల వేంకటేశ్వర్, మానిక్ రాజ్, జైసింహ, పులి జైపాల్, వి ఎం మహేష్, బిట్ట్ల రవి, చిన్యనాయక్, సంతోష్ నాగ్, సాయిప్రసాద్, శ్రీనివాస్, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు.