ఆర్మూర్, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శ్రీ భాషిత పాఠశాల 20 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుందని, విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కారణం నాకు బలమైన నా కుటుంబం అలాగే నా తోటి కొన్ని సంవత్సరాలుగా అనుబంధం పెంచుకొని పనిచేస్తున్న ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కారణం అని అన్నారు.
రాబోయే రోజులలో శ్రీ భాషిత పాఠశాల అనేది ఒక గొప్ప పునాదికి నాంది పలుకుతుంది అని కొనియాడారు. అంతే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాలలో మా పిల్లలు చదువుకుంటున్ననందుకు చాలా సంతోషంగా ఉంది, శ్రీ భాషిత పాఠశాలలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఒక పండగ వాతావరణంలా ఉంటుంది అని చెప్పారు..
అనంతరం పాఠశాల కరస్పాండెంట్ తల్లిదండ్రులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. వేడుకలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.