కామారెడ్డి, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి కలెక్టరేట్లోని శ్రీ లక్ష్మీ నరసింహ జిల్లా మహిళా సమైక్య క్యాంటీన్‌ను బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత సందర్శించారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. టీ పౌడర్ ను చూశారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు.
సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు రాజమణి, శోభ, లక్ష్మి, సులోచన, పుష్ప, లక్ష్మి డిపిఎం సుధాకర్, ఏపీఎం రాజేందర్, ప్రతినిధులు సంతోష్, రవీందర్ పాల్గొన్నారు.