కామారెడ్డి, మే 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా సేకరించి వెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా త్వరగా దించుకోవాలని పౌర సరఫరాల ఇంచార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం కేంద్రం నిర్వాహకులను, మిల్లర్లను ఆదేశించారు. బుధవారం బిక్నూర్ మండలంలోని కచ్చాపూర్ కేంద్రాన్ని, బస్వాపూర్ లోని విజయ గణపతి రైస్ మిల్, పూర్ణిమ రైస్ మిల్, బిక్నూర్‌లోని సిద్ధిరామేశ్వర రైస్ మిల్లులను డిప్యూటీ తహసీల్ధార్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మార్చి 26 న 350 కేంద్రాల ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించగా 327 కేంద్రాలలో పూర్తయిందని, ఇంకా 27 కేంద్రాలలో ధాన్యం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ప్రతి రోజు మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, కేంద్రాల నిర్వహకులతో సమీక్షిస్తూ త్వరితగతిన ధాన్యం సేకరణ పూర్తయ్యేలా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు.
సేకరించిన ధాన్యానికి 92 శాతం మేర అనగా రూ. 623 కోట్లు రైతుల ఖాతాలో డబ్బులు జమచేశామన్నారు.