కామారెడ్డి, మే 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బిబిపేట మండలం రామ్ రెడ్డి పల్లి, కోనాపూర్ దాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. శుక్రవారం సాయంత్రంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉంచిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు. బిబిపేటలోని శ్రీనివాస ఆగ్రో రైస్ మిల్లును జిల్లా ఇంచార్జ్ పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం సందర్శించారు.
7 లారీలు మిల్లు పాయింట్ వద్ద నిలిచి ఉన్నందున ధాన్యం అన్లోడిరగ్ వేగవంతం చేయాలని సూచించారు. 53,790 మంది రైతుల నుంచి 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.
వీటికి సంబంధించి రూ.683 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.632 కోట్లు జమ చేసినట్లు వెల్లడిరచారు. 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. 23 కేంద్రాలలో ధాన్యం సేకరణ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.