కామారెడ్డి, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గపూర్ శిక్షక్ రాసిన యుద్ధ గీతం, దీర్ఘ కవిత పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందని, మరో పుస్తకం ఎన్నికల ముచ్చట్లుగా ఉగాది కవితా సంకలనం కావన సమీరాలు పుస్తకాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు.
అనంతరం కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ అక్షరాలు సమాజాన్ని వెలుగు బాటలోకి తీసుకు వెళుతుందని అన్నారు. కాశ నర్సయ్య రాసిన చిత్రాలకు పద్యరూప స్పందన పుస్తకాన్ని సూరారం శంకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ జి లచ్చయ్య, సభాధ్యక్షులు శనిశెట్టి గంగ ప్రసాద్, మోహన్ రాజ్, నవీన్ రెడ్డి, డాక్టర్ సుజాత, విజయశ్రీ కవులు రామచంద్రం, నాగభూషణం, సీతాంబరం, తిరుపతి, యాదగిరి, చంద్రకాంత్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, డాక్టర్ వేదప్రకాశ్, బిబిపేట వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి కవులు రచయితలు పాల్గొన్నారు.