కామారెడ్డి, జూన్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణం దేవునిపల్లి రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో వారం రోజులుగా నీరు రాకపోవడంతో మహిళలు, చిన్న పిల్లలు బిందెలు పట్టుకొని వెంచర్ల నుండి నీరు మోసుకుంటున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడు నెలలుగా నీటి ఇబ్బంది ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో వాటర్ ట్యాంకర్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌కు దేవునిపల్లి రెండు పడక గదుల ఇండ్ల కాలనీ వాసులు రాతపూర్వకంగా విన్నవించారు.
కార్యక్రమంలో బాలాజీ, బీరయ్య, నరసింహులు, ఫాష, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.