విధుల్లో పాల్గొనకపోతే శాఖ పరమైన చర్యలు….

నిజామాబాద్‌, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్‌ సప్లిమెంటరీ జవాబు పత్రాలు మూల్యాంకనం బుధవారం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రవికుమార్‌ తెలిపారు. మొదటి స్పెల్‌ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితము, పౌర శాస్త్రము, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్ట్‌ ల మూల్యాంకనం ప్రారంభం కానుందని తెలిపారు.

మూల్యాంకనంలో పాల్గొనాల్సిన అధ్యాపకులకు ఆయా కళాశాలల లాగిన్లలో నియామక పత్రాలను ఇంటర్‌ బోర్డు నిక్షిప్తం చేసిందని తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల లు, మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాలలో, కేజీబీవీ కళాశాలల లో, మైనారిటీ రెసిడెన్షియల్‌ కళాశాలలో, బిసి రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇతర అన్ని జూనియర్‌ కళాశాలలో వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌ లు మూల్యాంకన విధులు కేటాయించబడిన అధ్యాపకులను తమ విధుల నుండి 4వ తేదీన రిలీవ్‌ చేసి మూల్యాంకన కేంద్రంలో పాల్గొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మూల్యాంకన విధులకు అధ్యాపకులను రిలీవ్‌ చేయని ప్రిన్సిపాల్‌లపై , రిలీవ్‌ చేసినా విధులలో పాల్గొనని అధ్యాపకులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడానికి ఇంటర్‌ బోర్డు సిద్ధంగా ఉందని రవికుమార్‌ తెలిపారు. కావున అధ్యాపకులు అందరూ తమకు కేటాయించిన మూల్యాంకన సబ్జెక్టులలో బుధవారం ఉదయం సరిగ్గా పది గంటలకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. రెండవ స్పెల్‌ 7 వ తేదీన శుక్రవారం బొటని, జూవలోజి, కెమిస్ట్రీ, కామర్స్‌, హిస్టరీ మూల్యాంకనం ప్రారంభం కానుందని అన్ని కళాశాలల్లో అధ్యాపకులను రిలీవ్‌ చేయాలని ఇంటర్‌ విద్య అధికారి ఆదేశించారు.

ఇంటర్‌ సప్లమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు…..

ఇంటర్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు జనరల్‌, ఒకేషనల్‌ అన్ని సబ్జెక్టు ల ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రవికుమార్‌ పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు అన్ని కూడా జిల్లా కేంద్రం లోని నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర ఖిల్లా జూనియర్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌ లు విద్యార్థులకు ఈ విషయమై అవగాహన కల్పించి జిల్లా కేంద్రంలో ప్రాక్టికల్‌ పరీక్షలకు హాల్‌ టికెట్‌లు ఇచ్చి పంపాలని ఆదేశించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »