కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండల పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకరయ్య భార్య బాలమణి అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున గ్రామ కాంగ్రెస్ నాయకులకు సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం వివరించారు.
షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్‌తో మాట్లాడి బాలమణికి ప్రభుత్వం తరపున చికిత్స నిమిత్తం రూ. 3 లక్షలు ఎల్.ఓ.సి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి బాలమణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.