కామారెడ్డి, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఖరీఫ్ 2022 -23 సీజన్ కు సంబంధించి లక్ష్యాలను పూర్తి చేయని డిఫాల్టర్ రైస్ మిల్లుల యజమానులు ఈనెల 26 లోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం లక్ష్యాలు పూర్తి చేయని 35 మంది రైస్ మిల్ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దిశ నిర్దేశం చేశారు.
ఈనెల 26 లోగా లక్ష్యాలు పూర్తి చేయని రైస్ మిల్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లపై ఆర్ఆర్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్లు కిష్టయ్య, శ్రీనివాస్, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.