నిజామాబాద్, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్యంలోని ఎన్. డి .ఏ. మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయలు కాల్చ మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ దేశ ప్రజలు మూడవ సారి అధికారాన్ని కట్టబెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు, గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ భద్రత పట్ల భావంతో పనిచేసే దేశ అభివృద్ధికి కృషిచేసి ప్రజాస్వాబద్ధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశ గొప్పతనాన్ని చాటి, దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిష్టపరిచి విశ్వ గురువుగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నానికి భారత ప్రజలు మద్దతు పలికారని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగల వెంకటేశ్వర్, లీగల్ సెల్ న్యాయవాదులు బండారి కృష్ణానద్, బైటల రవి, బిట్ల రవి, మధుసూదన్ గౌడ్, భిక్షపతి, బాగీచరన్ కేశవ్ రావు, ఆరేటి నారాయణ, మానిక్ రాజ్, మద్దేపల్లి శంకర్, మదన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్, అంకిత, న్యాయవాదులు పాల్గొన్నారు.