కామారెడ్డి, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనోజ్ఞ (20) కి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో ఒకసారి రక్తదానం చేయడానికి చాలామంది ఆలోచిస్తారని, అలాంటిది 10 సంవత్సరాల నుండి సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తూ నేటి సమాజానికి, యువతకు ఆదర్శంగా నిలిచిన కిరణ్‌కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కెబిఎస్ రక్తనిధి ప్రతినిధులు జీవన్, వెంకటేష్, సంతోష్ పాల్గొన్నారు.