కామారెడ్డి, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిర్దేశించిన లక్ష్యం మేరకు వరి ధాన్యాన్ని సేకరించి 10 శాతం విరిగిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
యాసంగి 2023-24 సీజన్లో సన్నరకం వరి ధాన్యం పొందిన మిల్లర్లతో ఆయన మాట్లాడారు. లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రైస్ మిల్లుల యజమానులు లక్ష్యాలను పూర్తి చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి మల్లికార్జున బాబు, ఇన్చార్జి సివిల్ సప్లై మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తాసిల్దార్లు, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.