బాన్సువాడ, జూన్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని అప్నా బజార్ యజమాని నటరాజ్‌కు శుక్రవారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి పరిచయం చేసుకొని వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ ఐదు సంవత్సరాల ఫీజు 9990 రూపాయలు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన యజమాని మున్సిపల్ కమిషనర్ యొక్క నంబరు తెలుసుకొని ఇది బోగస్ ఫోన్ అని గమనించి ఫోన్ లో ఉన్న అతనికి దబాయించడంతో ఫోన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడే వచ్చి దుకాణాన్ని జప్తూ చేస్తామని తెలిపాడని బాధితుడు తెలిపారు.
అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గాడుగుట్ల శ్రీనివాస్ తెలిపారు.