ఎస్సీ స్టడీ సర్కిల్‌ అక్రమాలపై విచారణ చేపట్టాలి

నిజామాబాద్‌, జూన్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఈ సందర్భంగా పీ.డీ.ఎస్‌.యు. నిజామబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ఎస్సీ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగ డీఎస్సీ కోచింగ్‌ ఎస్సి టిఎస్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ ఎస్సీ స్టడీ సర్కిల్‌ జిల్లా అధికారి అయిన డీఎస్సీడీవో శశికళ మరియు ఇన్చార్జి ఎస్‌. మారుతి, హెచ్‌.డబ్ల్యు నిర్వాహకన మూలంగా స్టడీ సర్కిల్‌ విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారన్నారు.

ఒక్కో విద్యార్థికి 75 రూపాయల చెప్పుకున్న నాణ్యమైన భోజనం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. కానీ డీఎస్సీడీవో మరియు మారుతి వాళ్ళ కక్కుర్తి వల్ల నాణ్యత లేని భోజనాన్ని పెడుతున్నారన్నారు. దాదాపు డీఎస్సీ షార్ట్‌ టైం కోచింగ్‌ కొరకు 40 మంది విద్యార్థులు మాత్రమే వస్తే 100 మంది వస్తున్నారని, భోజన మరియు బుక్స్‌ కు మెటీరియల్‌ సంబంధించిన వాటిలో అక్రమాలు జరిగాయన్నారు.

మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థులు కోరగా డీఎస్సీడీవో మరియు ఎస్‌. మారుతి హెచ్డబ్ల్యూ విద్యార్థుల పైకి దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధముగా జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల నాలుగో తరగతి సిబ్బందిని స్టడీ సర్కిల్‌ నందు విధులను కేటాయిస్తూ, వారికి బదులు బినామీ పేర్ల మీద జీతాలు నొక్కేస్తున్నారన్నారు. నియమ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల వసతి కోసం స్టడీ సర్కిల్‌ దూరంగా ఏర్పాటు చేసి, అద్దెకు సంబంధించిన యజమాని పేరు మీద కాకుండా ఇన్చార్జి ఎస్‌.మారుతి,హెచ్డబ్ల్యూ పేరు పైన డబ్బులు డ్రా చేయడం దారునమన్నారు.

40 మంది విద్యార్థులు వస్తే 100 మంది విద్యార్థులకు బుక్స్‌ కొనుగోలు చేశారని వారికి ఇచ్చినట్లు అక్విటెన్స్‌ సృష్టించి బిల్లులు క్లెయిమ్‌ చేశారన్నారు. ఇటువంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. వెంటనే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి నిధులు రికవరీ చేసి డీఎస్సీడీవో శశికళ మరియు ఎస్‌.మారుతి,హెచ్డబ్ల్యూ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో పి.డి.ఎస్‌.యు. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే. అశుర్‌, జిల్లా నాయకులు మహిపాల్‌, సందీప్‌, సృజన్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »