కామారెడ్డి, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో లక్ష్మి (42) కి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో గోపాల్ పేట్ మండలంకి చెందిన కటేపల్లి నాగరాజుకి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చారు. శనివారం మొదటి వివాహ వార్షికోత్సవం కావడం ఆపదలో ఉన్న మహిళకు సహాయం చేసే అవకాశం దొరకడం సంతోషాన్ని కలిగించిందని రక్తదాత పేర్కొన్నారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత నాగరాజుకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు సురేష్ రెడ్డి, టెక్నీషియన్లు జీవన్, వెంకటేష్, సంతోష్ పాల్గొన్నారు.