ఆర్మూర్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్‌కు చెందిన సౌందర్య, మనిశ్ దంపతులకు సింధూర, మధుర అనే కుమార్తెలు వుండగా కుమార్తెలు మధుర, సింధూరలను ఆలూరులోని అమ్మమ్మ లావణ్య ఇంట్లో వదిలి వెళ్లగా చిన్నారులు సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతలో సింధూజ కూలర్‌ను తాకింది.
దీంతో విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆర్మూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా కుటుంబంలో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. కూలర్ షాక్‌కు గురై 15 రోజుల క్రితం ఓ చిన్నారి మృతి చెందగా ఇది రెండో ఘటన.