సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినా ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం ఈనెల 10న సోమవారం నుండి తిరిగి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను లేదా సమస్యలను నేరుగా ప్రజావాణిలో అందజేయవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »