కుళాయిల సమగ్ర సర్వే సజావుగా చేపట్టాలి

కామారెడ్డి, జూన్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గ్రామపంచాయతీలో కుళాయిల సమగ్ర సర్వే పంచాయతీ కార్యదర్శులు సజావుగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ రేట్లు సోమవారం పంచాయతీ కార్యదర్శులకు మిషన్‌ భగీరథ నీరు అందే సమగ్ర వివరాలను సేకరించే విధానంపై శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు సేకరించి వివరాలను మొబైల్‌ యాప్‌లో నిక్షిప్తం చేయాలని చెప్పారు.

సమగ్ర వివరాలను తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడిరచారు. మిషన్‌ భగీరథ పథకంలో ఏర్పాటు చేసిన ఇంటింటా తాగునీటి పరిస్థితిపై సమగ్ర సర్వే చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా వస్తుందా, నల్ల కనెక్షన్‌ ఉందా, ఆ కుటుంబానికి నీరు సరిపోతుందా, కొత్త గృహాలకు తాగునీటి సదుపాయం ఉంది. లేనిది వంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటా సమగ్ర సర్వేను నిర్వహిస్తుందని చెప్పారు.

పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను తెలుసుకునేందుకు కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవడానికి పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి కార్యకర్తలు, ఐకెపి, ఉపాధి హామీ సిబ్బందిని సర్వేలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడిరచారు. నల్లాల సమాచారాన్ని ప్రత్యేకంగా భగీరథ మొబైల్‌ యాప్‌ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఆయా గృహాలకు వెళ్లిన సిబ్బంది యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు, సెల్‌ ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌ నమోదు చేసుకోవాలని చెప్పారు.

లబ్ధిదారుడితో కలిపి ఇంటి ఫోటో, కుళాయిల ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్‌ చేయాలని సూచించారు. గ్రామాల వారిగా సేకరించిన సమాచారం మండలాలకు, ఆ తర్వాత జిల్లాకు చేరుతుందని వెల్లడిరచారు. వివరాలు మొత్తం క్రోడీకరించిన తర్వాత అన్ని ఇళ్లలోని కుళాయిలకు నీటి సరఫరా ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, మిషన్‌ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »