నిజామాబాద్, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉండడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణిని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం నుంచి మళ్ళీ పునరుద్ధరింపజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.