కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి మెడికల్ కళాశాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ల్యాబ్లను పరిశీలించారు. గ్రంథాలయంను సందర్శించి పుస్తకాలు కొరత ఉందని అధికారులు తెలపడంతో కావలసిన పుస్తకాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
కళాశాలలో తాగు నీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు. మెడికల్ కళాశాల ఆవరణలో ఉద్యానవనం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఉద్యానవనంలో ఔషధ మొక్కలు నాటాలని అధికారులను కోరారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సుజాత, అధ్యాపకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.