కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పశువుల అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. ఈ నెల 17 న బక్రీద్ పండుగ సందర్భంగా జంతు సంక్షేమం, గోవధ నిషేధం చట్టం 1977 అమలుపై పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సంబంధిత పశువుల డాక్టర్ ధ్రువీకరణ లేనిదే ఆవులను తరలించడం నిషేధమన్నారు.
పశు సంరక్షణ చట్టానికి లోబడి క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ పశువులను విధించకుండా చూడాలన్నారు. చెక్ పోస్ట్ ల నిఘా లుపెట్టాలని, రవాణాలో ఆవులను, లేగ దూడలను గుర్తిస్తే మున్సిపల్ సిబ్బందికి అప్పజెప్పాలని , పశువులను అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. పశువులను తరలించే వాహనాలలో పశువులకు సరిపడా స్థలం ఉందో లేదో గుర్తించాలని, ప్రత్యేక పర్మిట్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని తెలిపారు.
రామేశ్వర్లపల్లిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ప్రారంభమైందని, కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయడం ఒక్క మునిసిపల్ శాఖ పని కాదని, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, వ్యాపార సంస్థలు, పెంపుడు జంతువుల ప్రేమికులు శస్త్ర చికిత్సలు చేయడానికి ముందుకువచ్చి విరాళాలందించాలన్నారు. భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉందని, స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు జంతువుల మీద పక్షుల మీద జాలి, దయ, కరుణ చూపే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో ఉన్న 30 పశు వైడ్ కేంద్ర భవనాలకు చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటె చేపట్టి రంగులు వేయాలని, పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటాలన్నారు. రైతులు పంట పొలాలలో అజోల్లా కల్చర్ పై అవగాహన కలిగించాలన్నారు.
సమావేశంలో జిల్లా పశు సంవర్ధక అధికారి సింహ రావు, పశువైద్య సహాయ సంచాలుకు రోహిత్ రెడ్డి, భాస్కరన్ , అటవీ, వాణిజ్య, రవాణా, విద్యా శాఖ ప్రతినిధులు రమేష్, గంగాధర్, శ్రీనివాస్, ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, వేటరినరీ అసిస్టెంట్ సర్జన్‌లు తదితరులు పాల్గొన్నారు.