కామారెడ్డి, జూన్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లిలో జంతువుల రక్షణ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ ఆధ్వర్యంలో జంతువులకు రక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కుక్కలకు ఇక్కడ శస్త్ర చికిత్సలు చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. కుక్కల బారీ నుంచి ప్రజలను రక్షించడానికి జంతువుల రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సింహరావ్, అధికారులు సంజయ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.