ఎల్లారెడ్డి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి మండలం వెళ్ళుట్ల పేట గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మదన్ మోహన్ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఏది సాటిరాదని, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇంకా ఎందరో మంది అత్యున్నత పదవులలో కొనసాగుతున్న ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు చాలా మంది ప్రభుత్వ బడులలో చదువుకున్నవారేనని, తల్లి దండ్రులు అందరూ ఆలోచించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు.