గాంధారి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి తన మొదటి జీతం 4 లక్షలను ఎల్లారెడ్డి ఎంఎల్‌ఏ మదన్ మోహన్ విరాళంగా అందజేశారు. గాంధారి మండలం సర్వపూర్ గ్రామంలో దొంతులల బోయిన వెంకట్ (42) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. వెంకట్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, వారి కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయారు.
పిన్న వయసులోనే మరణించిన వెంకట్ కుటుంబంలో భార్య అంజమ్మ, ఇద్దరు చిన్న పిల్లలతో కడు పేదరికంలో చిన్న గుడిసెలో ఉండటం మదన్ మోహన్‌ను బాధించింది. భర్త అకాల మరణంతో, కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. ఇద్దరు చిన్న పిల్లలతో దిక్కుతోచని అంజమ్మకు అండగా, వెంటనే తన మొదటి జీతంతో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి వెంకట్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్.
కాంగ్రెస్ కార్యకర్తలు తన కుటుంబం లాంటివారని, వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా తాను అండగా ఉంటానని, ప్రతి కార్యకర్తకి భరోసా ఇచ్చారు. ఇంటి పెద్ద చనిపోతే, భార్యా పిల్లలు గౌరవంగా బ్రతకడానికి కూడు, గూడు ఎంతో అవసరమని, ఇటువంటి నిరుపేదలకు తన స్వంతంగానే కాకుండా, ప్రభుత్వపరంగా కూడా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తన భర్త వెంకట్ అకస్మాత్తుగా చనిపోతే, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే మదనన్న వచ్చి మాట్లాడితే, స్వంత అన్నలా వచ్చి అండగా నిలబడ్డాడని, మదనన్నకు తన కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటుందని వెంకట్ భార్య అంజమ్మ తెలిపారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకొని మిగిలిన జీతం ఎల్లారెడ్డి పెదాల కోసం ఖర్చు చేస్తానని ఎన్నిక సందర్భంలో మదన్ మొహం ప్రకటించారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పేదలకు ఆసుపత్రి చికిత్స, సి.ఎం రిలిఫ్ ఫండ్ మరియు ఆసుపత్రులలో కాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కొరకు ఎల్.ఓ.సిలు రికార్డు సంఖ్యలో మంజూరు చేయించారు. ఎంతోమంది ఎల్లారెడ్డి ప్రజలకు తన ఉచిత అంబులెన్సు ద్వారా సత్వరమే రోగులను నయాపైసా ఖర్చు లేకుండా ఆసుపత్రికి చేర్చడానికి ఉచిత అంబులెన్సును మదన్ మోహన్ తన ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెన్యూర్ మదన్‌మోహన్ ఎమ్మెల్యేగా ఉండటం తమకు గర్వకారణం అని ఎల్లారెడ్డి యూత్ అంటుండగా, మదనన్న మాతోనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు, తాను ఎప్పుడూ అండగా అందుబాటులో ఉన్నాను అని ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ తెలిపారు.