కామారెడ్డి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా మత్స్యకారుల సహకార సంఘం కొత్తగా భవనం నిర్మాణం చేయుటకు కావలసిన నిధులను ఇవ్వాలని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ను కోరుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా మత్స్యకారుల సహకార సంఘం మొదటి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతను బట్టి నూతన సభ్యత్వాలను తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులకు అందే వివిధ సంక్షేమ పథకాలపై సభ్యులతో చర్చించారు. జిల్లా మత్స్య సహకార సంఘం కామారెడ్డి పేరుతో నూతన ఉమ్మడి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించుట విషయమై సభ్యులతో చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో మత్స్యకారుల సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ కె. వరదారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల సాయిలు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.