Daily Archives: June 12, 2024

14న మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బి ప్రోగ్రామ్‌ లో డిపివో (డిజిటల్‌ ప్రొసెస్‌) కొరకు 2023 మరియు 2024 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ సిఇసి, హెచ్‌ఇసి, వొకేషనల్‌ గ్రూపులో పూర్తి చేసుకున్న విద్యార్థులకు మాత్రమే ఈనెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కామారెడ్డిలో మెగా జాబ్‌ …

Read More »

బాలలను పనిలో పెట్టుకుంటే నేరం…

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినంకై న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం (ఎస్‌టి గర్ల్స్‌ హాస్టల్‌ ) కామారెడ్డిలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సిహెచ్‌.వి.ఆర్‌.ఆర్‌. వరప్రసాద్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. …

Read More »

నాటుసారా స్థావరాలపై దాడులు

కామరెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి ఎస్‌. రవీందర్‌ రాజు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ సిబ్బంది బుధవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇట్టి దాడుల్లో సోమరం పేటకు చెందిన చిట్టవేని నర్సయ్య ఇంట్లో 3 లీటర్ల నాటుసారా లభ్యమైంది. అతన్ని విచారించగా సోమరంపేటకు చెందిన మాలోత్‌ వీణ …

Read More »

దోస్త్‌ ఆన్‌లైన్‌ ప్రత్యేక కేటగిరి వారికి 13న ధ్రువపత్రాల పరిశీలన

డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోస్‌ ఆన్లైన్‌ డిగ్రీ ప్రవేశానికి 2024 -25 సంవత్సరానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో తేదీ 13న ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని దోస్త్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య కే.సంపత్‌ కుమార్‌ తెలిపారు. పి హెచ్‌ సి (దివ్యాంగులు) సి …

Read More »

గాయత్రి యజ్ఞంతో పాఠశాల పునః ప్రారంభం

ఆర్మూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు పట్టణం లో ప్రముఖ పాఠశాల అయిన శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌ పాఠశాలలో బుదవారం గాయత్రి హోమం నిర్వహించారు. పాఠశాల పునః ప్రారంభం అవ్వడం వల్ల విద్యార్థులకు మంచి విద్యా బుద్దులు రావాలని ఒక మంచి నడవడిక విద్యార్థులలో మెదలాలని మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి విద్యార్థికి తెలియాలని ఒక సదుద్దేశ్యంతో గాయత్రి యజ్ఞం చేయించడం జరిగినదని …

Read More »

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మాక్లూరు గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ఒకటవ తరగతిలో కొత్త అడ్మిషన్లు, 2 వ తరగతిలో (01), 5 వ తరగతిలో (06) మిగిలిన ఖాళీ సీట్లకు ఎస్టీ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఆమోదం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. ఆసక్తిగల …

Read More »

విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని బోధన్‌ నియోజకవర్గ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటను పురస్కరించుకుని బుధవారం బోధన్‌ పట్టణం రాకాసిపేట్‌ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని …

Read More »

విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5 ,8 వ తరగతుల్లో గిరిజన బాలురు, బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూన్‌ 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 7.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 2.32 వరకుయోగం : హర్షణం సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ ఉదయం 6.30 వరకు తదుపరి తైతుల రాత్రి 7.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.28 – 3.12దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »