కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నేడు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినంకై న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం (ఎస్‌టి గర్ల్స్ హాస్టల్ ) కామారెడ్డిలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్.వి.ఆర్.ఆర్. వరప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు సూచనలు, చట్టాలపైన అవగాహన కల్పించారు.
అలాగే కలలు కనాలి సాధన చేయాలి అని పిలుపునిచ్చారు. అలాగే అబ్దుల్ కలం రచించిన వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకాన్ని చదవమని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గవర్నమెంట్ విద్య సంస్థల్లో చదువుకున్న వాళ్లలో అతిధ్యధికంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారని అయన అన్నారు. విద్యార్థులను చిన్న ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉద్యోగాలు సాదించాలని కోరారు.
అలాగే చైల్డ్ లేబర్ అనేది చట్టరీత్య నేరం తల్లి దండ్రులు, ఎంప్లొయెర్ బాల కార్మికులను ఎలాంటి పరిస్థితిలో అయినా పెట్టుకున్నా అది చట్ట రీత్యా నేరమని అయన తెలిపారు. ఎటువంటి న్యాయ సహాయం కోసమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించవచ్చన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరల్డ్ డే ఎగెన్ట్స్ చైల్డ్ లేబర్ పోస్టర్ రీలీజ్ చేసారు.
కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ రమేష్ చంద్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ చిరంజీవి, ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం (ఎస్.టి. గర్ల్స్ హాస్టల్) కామారెడ్డి వార్డెన్ టీ. స్వప్న, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, ఖాన్, సాయిప్రణీత్, సాయికృష్ణ , ఐఎస్‌ఆర్‌డి కామారెడ్డి ఎన్‌జివో ప్రతినిధి అమృత రాజేందర్ మాట్లాడుతూ బాల కార్మికుల గూర్చి అయన సందేశం ఇచ్చారు.
అలాగే అయన వాళ్ళ ఎన్‌జివో ద్వారా పని చేసే ఎన్‌జివో విస్తృతంగా భాగస్వామ్య ఆర్థిక శ్రేయస్సును ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యం మరియు సుపరిపాలనను బలోపేతం చేయడం, మానవ హక్కులను రక్షించడం, ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆహార భద్రత మరియు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడం, తదుపరి విద్య, సుస్థిర విద్య, ఆరోగ్యం, యువత సాధికారత, మహిళా సాధికారత, బాలల హక్కులు, సంఘర్షణలను నివారించడానికి మరియు కోలుకోవడానికి సంఘాలకు సహాయం చేయండి, సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల నేపథ్యంలో మానవతా సహాయం అందిస్తామని తెలిపారు.
సాధన ఎన్‌జివో ప్రతినిధి రవి, సాధన ఎన్‌జివో అనేది బాలల హక్కుల గూర్చి బాలల అభివృద్ధి కొరకు, చైల్డ్ మ్యారేజ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే సిబ్బంది పాల్గొన్నారు.