కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5 ,8 వ తరగతుల్లో గిరిజన బాలురు, బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు.
విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మూడవ తరగతిలో 11 సీట్లు ఉండగా 59 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఐదవ తరగతిలో ఆరు సీట్లకు 68 మంది విద్యార్థులు, 8వ తరగతిలో ఐదు సీట్లకు 32 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మొత్తం 22 సీట్లకు 159 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. వీరిలో 22 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.