నిజామాబాద్, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని మాక్లూరు గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ఒకటవ తరగతిలో కొత్త అడ్మిషన్లు, 2 వ తరగతిలో (01), 5 వ తరగతిలో (06) మిగిలిన ఖాళీ సీట్లకు ఎస్టీ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆమోదం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు.
ఆసక్తిగల ఎస్టీ బాలికలు సంబంధిత పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మాక్లూర్ మండలానికి చెందిన విద్యార్థినులు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సీట్లు మిగిలిన పక్షంలో ఇతర మండలాల వారికి అవకాశం ఇస్తామన్నారు. ఒకటవ తరగతిలో చేరే విద్యార్థులు ఐదు సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న బాలికలు ఆధార్ కార్డ్, జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను తీసుకొని దరఖాస్తు ఈ నెల 20 వరకు సమర్పించాలన్నారు.
విద్యార్థులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మినీ గురుకులంలో సీబీఎస్‌ఈలో విద్యాబోధన ఉంటుందని చెప్పారు.